రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ.. పట్టుకున్న అధికారులు
ధర్మారం// పెద్దపల్లి జిల్లాలో గత కొంతకాలంగా పిడిఎస్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపేందుకు ఆసరాగా నిలుస్తుంది. అధికారులు ఎన్నిసార్లు పట్టుకుని కేసులుపెట్టినా అక్రమార్కుల దందాలు మూడు పువ్వులుఆరుకాయలు అనే చందంగా మారింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం గ్రామంలో శుక్రవారం శ్రీలక్ష్మి నరసింహ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని...