జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టొద్దు, రాష్ట్రాల ఆదాయ హక్కులను కాపాడాలి, జీఎస్టీ మార్పులపై పూర్తి ఆర్థిక ప్రభావం వెల్లడించాలి.. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగే నిర్ణయాలు వద్దు 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

  జీఎస్టీ అమలు కోసం రాష్ట్రాలు తమ పన్ను విధించే స్వతంత్ర అధికారాల్లో గణనీయమైన భాగాన్ని వదులుకున్నాయని, ఆ సమయంలో ఏర్పడిన విశ్వాసాన్ని కేంద్రం–రాష్ట్రాలు కలిసి కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు జీఎస్టీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చాల్సిన అవసరంపై కీలక అంశాలను ప్రస్తావించారు. జీఎస్టీ తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో సుమారు...