155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం: సీఎం రేవంత్
Oct 21, 2026, తెలంగాణ : సమాజం కోసం ప్రాణాలను అర్పించిన వారి స్మరించుకోవటం అందరి బాధ్యతని సీఎం రేవంత్ గుర్తు చేశారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణదినం కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం ఎందరో పోలీసులు ప్రాణాలు అర్పించారు. మనమంతా ప్రశాంతంగా జీవించడానికి ఎందరో జవాన్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయటం లేదు. దేశం కోసం సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన త్యాగానికి గుర్తుగా పోలీసు సంస్మరణదినం నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం'...