వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ ,బంగారు, వెండి ఆభరణాలు,నగదు స్వాధీనం,పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించిన జైపూర్ పోలీసులు
ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో తాళాలు పగులగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జైపూర్ ఎస్ఐ భూమేష్ తెలిపారు. నిందితుడి వివరాలు: సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి. వివరాల్లోకి వెళితే.. నిందితుడు తన స్నేహితుడు మహ్మద్ మగ్దూంతో కలిసి సెప్టెంబర్ 28న ఇందారం గ్రామంలో రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు,వెండి ఆభరణాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన నగదు, ఆభరణాలను ఇద్దరూ పంచుకున్నట్లు నిందితుడు తెలిపాడు....