పోలీసులమంటూ వ్యాపారి కిడ్నాప్.. రూ.15 కోట్ల డిమాండ్.. రూ.1.3 కోట్లు వసూలు
హైదరాబాద్‌లో పోలీసులమంటూ ఓ 53 ఏళ్ల నగల వ్యాపారిని కిడ్నాప్ చేసిన ముఠా.. కుటుంబ సభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేసి, రూ.1.3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 5న రామంతాపూర్‌లోని తన నగల దుకాణానికి వెళ్తున్న కే శ్రీనివాసరావును గోల్నాక ఫ్లైఓవర్ సమీపంలో కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు విచారణలో వెల్లడైంది. బోడుప్పల్‌లోని హేమానగర్ రియల్ ఎస్టేట్ వెంచర్ వివాదమే కిడ్నాప్‌కు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు దుమావత్ శ్రీకాంత్.....