మంచిర్యాల్/లక్షెట్టిపేట
లక్షెటపేట మండలం గుల్లకోట స్టేజి సమీపంలో అడవిపందిని ఢీకొని బైక్ బైక్ పై వస్తున్న దుర్గం రాములు అనే 48 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. మృతుని స్వగ్రామం దౌడేపల్లి. ఐకెపిలో సి ఎ గా పని చేస్తున్నాడు. నిన్న ఉదయం నాలుగు గంటలకు అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కి చెందిన కొంతమంది ఏజెంట్లతో కలిసి విజయవాడ దైవదర్శనం కి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుండి తన బైక్ పై వెళ్లి బైక్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పెట్టి విజయవాడ దైవదర్శనం ముగించుకుని అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ట్రైన్ దిగి తన బైక్ పై దౌడేపల్లి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో గుల్లకోట స్టేజ్ సమీపంలోని రహదారిపై అడవి పంది అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అడవి పంది ఢీకొని కిందపడి తలకు బలమైన రక్తపు గాయమై అక్కడికక్కడ చనిపోయాడు మృతునికి భార్య ఇద్దరు కుమారుల సంతానం కలరు మృతుని భార్య సుభాషిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.