PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:15 am Posted by : PORU TELANGANA

మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: చెట్టి సురేష్

*👉 రోస్టర్ సవరణ కోసం మాలల సమర శంఖం*

*👉 అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ సభ*

*👉 మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: చెట్టి సురేష్*

భద్రాద్రి కొత్తగూడెం,
(పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి)
అశ్వాపురం :-
హైదరాబాద్: మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా రోస్టర్ విధానంలో అవసరమైన సవరణలు సాధించేందుకు అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగుల భారీ సభను విజయవంతం చేయాలని మాల సంఘాల జేఏసీ పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు చెట్టి సురేష్ పిలుపునిచ్చారు.

రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రోస్టర్ విధానంలో మాలలకు న్యాయం జరిగేలా అవసరమైన సవరణలు సాధించేందుకు భవిష్యత్ కార్యాచరణను ఈ సభలో రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెట్టి సురేష్ అన్నారు.

అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఈ భారీ సభకు మాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మాల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రోస్టర్ సవరణ సాధన కోసం మాలల సమర శంఖం పూరిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు చెట్టి సురేష్. జూపెల్లి ధ్రువకుమార్ కోరారు…