సుదర్శన్ గౌడ్ కుటుంబానికి 6 లక్షల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటాం..
జగిత్యాల్// హుస్నాబాద్ : రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబం చేసిన విజ్ఞప్తిపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో, సీఎం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు అట్టి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో, ప్రభుత్వ NRIఅడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్...