PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 9:00 pm Posted by : PORU TELANGANA

జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు స్పందన

Oct 16, 2026,

తెలంగాణ : జగిత్యాల అర్బన్ కాలనీలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లపై జీవన్ రెడ్డి చేసిన విమర్శలను గుర్తుచేస్తూ, పార్టీ మారగానే వారంతా మంచివారయ్యారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలపై ఆరోపణలు కాకుండా, దమ్ముంటే పంట ఎండిపోయిన చోటు చూపాలని సవాల్ విసిరారు.