PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 12:10 pm Posted by : PORU TELANGANA

పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

ధర్మపురి పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధాకర సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు.