ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారుల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాపార పరిస్థితులు, లాభనష్టాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత కమిషనర్‌కు సమస్యలను తక్షణమే పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు.

అనంతరం నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కార్యవర్గం సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.