ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అభివృద్ధి, సంక్షేమ పనులను గడువులోగా పూర్తి చేయాలి తాగునీటి సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలి రూ.57.69 కోట్లతో 9 పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా ఆధునికీకరిస్తున్నాం 10 వేల మంది మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం

జమలాపురం: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సరఫరాపై పూర్తి...