సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలో విపక్షాల నిరసన ర్యాలీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు మంగళవారం ఉదయం దిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. “మేము కుక్కలు కాదు, కాక్‌రోచ్‌లు కాదు, పురుగులు కాదు — ఈ దేశ పౌరులం” AISA అధ్యక్షురాలు నేహా బోరా నిరసన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని ఆమె పేర్కొన్నారు.