గోదావరి బ్రిడ్జి వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జి వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్‌తో కలిసి బుధవారం అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, బందోబస్తు విధులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి...