దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు
నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం స్థానిక దేవాలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.పంచె, లాల్చీ ధరించి, అంచులున్న కండువాను మెడలో వేసుకుని పూజల్లో పాల్గొన్న మంత్రి.. పండుగ వేళ స్వగ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. గ్రామస్తులతో ఆత్మీయ పలకరింపులు.. మంత్రి స్వగ్రామానికి చేరుకోవడంతో నారాయణపురంలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల...