సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్ల నిరసన.. అడ్డుకున్న పోలీసులు

  న్యూఢిల్లీ //సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ సీజేపీ (CJP) ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంతర్‌మంతర్‌ వద్దకు వస్తున్న నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. మరోవైపు, సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి జంతర్‌మంతర్‌కు ర్యాలీగా వెళ్తున్న లాయర్లను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.