సేవకు దక్కిన అరుదైన గౌరవం.
పలువురు ప్రముఖులు ప్రశంసలు, శుభాకాంక్షలు.
భద్రాద్రి కొత్తగూడెం,
పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి-వల్లెపోగు రాము)
అశ్వాపురం :-
అశ్వాపురం మండల కేంద్రంలోని మంచికంటినగర్ నందు ఆరిఫా,రోషిని అండ్ రీమా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న, నిర్వాహకురాలు శ్రీమతి షేక్.షహనాజ్ బేగం కు అంతర్జాతీయ శాంతి – ప్రతిభ పురస్కారం వరించింది. వంశీ ఈవెంట్స్ అండ్ మోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన, ఈ అంతర్జాతీయ శాంతి- ప్రతిభ పురస్కారం 2026 ను డిప్యూటీ స్పీకర్ జాటో రామచంద్రం నాయక్ చేతుల మీదుగా శుక్రవారం రాత్రి ఈ అవార్డు అందుకున్నారు. అక్టోబర్ 2 న హైదరాబాద్ , కింగ్ కోటి తిలక్ రోడ్ లో ఉన్న తెలంగాణ సరస్వత పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగినది. 15 సంవత్సరాలుగా ,ఆరిఫా, రోషిని అండ్ రీమా వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ, ఎంతో మంది అనాధ వృద్ధులకు చేరదీసి, మానవత దృక్పథంతో విశిష్ట సేవలు అందిస్తూ, ఎంతోమంది అనాధ వృద్ధులకు తానే అమ్మలకే అమ్మాయి సకల సౌకర్యాలు అందిస్తూ, కుల మతాలకు అతీతంగా ప్రేమానురాగాలు పంచుతూ, కన్నబిడ్డలే కాదని నిరాదరణకు గురిచేసి జీవితం మీద విరక్తి చెందేలా చేసి చివరికి తమ బ్రతికే భారమై ఎవరిని ఆశ్రయించాలో తెలియని క్షణంలో నేనున్నానంటూ ఆరిఫా రోషిని రీమా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు తోడ్పాటున అందిస్తూ, వారికి చేస్తున్న సేవలను, వారిపట్ల చూపిస్తున్న ఓపికకు ఈ శాంతి మరియు ప్రతిభ పురస్కారం అందించడం జరిగినదనీ, డాక్టర్ అండ కేర్ శ్రీనివాస్ ఆశ్రమ నిర్వాహకురాలని శాంతి కొనియాడారు. ఈ కార్యక్రమంలో… డా. వంశీ, డా. శ్రీనివాస్, జర్మన్టన్ హాస్పిటల్ అత్తాపూర్ నిర్వాహకులు,డా. ఇఫ్తికార్ మరియు నగర పుర ప్రముఖులు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.