మహిళలు,బాలికల భద్రతలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలి- సీపీ అంబర్ కిషొర్ ఝా ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి//రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళలు, పిల్లల భరోసా కేంద్రాల సేవలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ, మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై ఆధారాలను సేకరించి, అవసరమైన కేసులు నమోదు...