పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ అధికారి స్టేషన్లో అందుబాటులో ఉంటూ నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని,...