PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:38 am Posted by : PORU TELANGANA

ఓబీసీ సింహ గర్జనను విజయవంతం చేయండి

కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి..

మహేశ్వరం, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

నేడు జరిగే ఓబీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలని కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఓబీసీ సింహగర్జనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని అన్నారు. ఓబీసీ సింహ గర్జన విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఒక సందేశం పంపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బొక్క భూపాల్ రెడ్డి, ఎండి అబ్జల్ బేగ్, పాండురంగారెడ్డి, బలరాం, గాదె కుమార్, దర్శన్, జగదీష్ కురుమ, అనిల్, సుధాకర్, పవన్, సురేష్, రంజిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.