సైబర్ నేరాల నివారణకు సాంకేతిక నైపుణ్యాలను వినియోగించాలి,అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణకు తొలి అడుగు“ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి” :రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ప్రజలు, ఉద్యోగుల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారులకు సైబర్ నేరాలు,ఆన్లైన్ మోసాలు,సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జోన్, రామగుండం సర్కిల్, ఎన్టీపీసీ పోలీసులు, రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫియాజ్ టైయబ్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్...