తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్, అక్టోబర్ 23న హైదరాబాద్లో జరగనున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు
పోలీస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఉన్నతాధికారులు పాల్గొని పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు డిసెంబర్లో తిరుపతిలో జరగనున్న 61వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సదస్సు ఎజెండా లో చేర్చబడతాయి. రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడంపై సారించారు. ఇలాంటి ప్రాంతీయ సమావేశాలు వృత్తిపరమైన ఉత్తమ...