అమెరికా రహదారిపై ఆగిపోయిన మరిపెడ బిడ్డ జీవితం.. సుప్రజ దుర్మరణం

*అమెరికా రహదారిపై ఆగిపోయిన మరిపెడ బిడ్డ జీవితం.. సుప్రజ దుర్మరణం...!* పోరుతెలంగాణ డిజిటల్ మీడియా (ప్రతినిధి మరిపెడ):-రెస్టారెంట్ మూసేసి ఇంటికి బయలుదేరిన కొద్దిసేపటికే మృత్యువు ఒడిలోకి.. ట్రక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి.. భర్త, కుమారుడిని వదిలి తిరిగిరాని లోకాలకు పయనం మరిపెడ: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. ఈ విషాద ఘటనతో మరిపెడలోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న...