PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:29 pm Posted by : PORU TELANGANA

దేశంలో బియ్యం కొరతే లేదు – మాఫియా దోపిడీ ! …..రేట్లు పెంచేస్తున్నారు దళారులు….చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు

_దేశవ్యాప్తంగా సామాన్యుడి కంచంలో అన్నం ముద్ద ఖరీదుగా మారుతోంది. గత కొన్ని వారాలుగా సాధారణ, సన్న బియ్యం ధరలు క్వింటాకు రూ. 600 నుంచి రూ. 1,000 వరకు ఎగబాకడం, బహిరంగ మార్కెట్లో కిలో ధరపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర భారం పడటం మధ్యతరగతి, పేద వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది._

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బియ్యం బ్యాగుల ధరలు మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరాయి. రాబోయే రోజుల్లో బియ్యం కొరత రానుందంటూ ప్రచారం తెరపైకి రావడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నా

_అధికారిక గణంకాలను నిశితంగా పరిశీలిస్తే.. దేశంలో బియ్యం కొరత ఉందన్న వాదన పచ్చి అబద్ధమని తేటతెల్లమవుతోంది. భారత ఆహార సంస్థ , కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో నిర్దేశిత నిబంధనల కంటే దాదాపు రెట్టింపు, మూడు రెట్లు అధికంగా బఫర్ స్టాక్ అందుబాటులో ఉంది. కేంద్ర పూల్‌లో దాదాపు 350 నుంచి 380 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు భద్రంగా ఉన్నాయి. గతేడాది రికార్డు స్థాయి వరి దిగుబడి రావడం, ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో దేశీయంగా అవసరాలకు మించిన ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు పెరుగుతున్నాయన్న వాదన ఏమాత్రం సహేతుకం కాదు. అసలు సమస్య ఉత్పత్తిలో లేదు.. సరఫరా వ్యవస్థలో పాతుకుపోయిన మధ్యవర్తుల గుత్తాధిపత్యంలోనే ఉంది._

రేట్లు పెంచేస్తున్నారు దళారులు_*

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందంటే.. పండగ సీజన్లు, కొత్త పంట చేతికి వచ్చే నవంబర్-డిసెంబర్ మధ్య కాలాన్ని ఆసరాగా చేసుకుని బడా మిల్లర్లు, ట్రేడర్లు సిండికేట్ గా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఖరీఫ్ పంట రాకకు ముందు మార్కెట్లో సన్న బియ్యం లభ్యత తక్కువగా ఉండే ఈ స్వల్ప కాలాన్ని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున నిల్వలను పెంచుకుంటూబ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ కారణంగాఎగుమతుల పరిమితులు ఎత్తివేస్తారన్న ఊహాగానాలతో, భారీ లాభాలు దండుకునేందుకు ప్రైవేట్ వ్యాపారులు సరుకును బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయకుండా అట్టిపెడుతున్నారు. ఈ బ్లాక్‌మార్కెట్ లాబీయింగ్ వల్లే నిల్వలు పుష్కలంగా ఉన్నా మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి._

చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు_*

ఈ దోపిడీని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పౌరసరఫరాల శాఖలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి. బఫర్ స్టాక్ ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్ విక్రయ పథకం ద్వారా చౌకగా బియ్యాన్ని విడుదల చేసి ధరలను నియంత్రించడంలో కేంద్రం ఆలస్యం చేస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వాల విజిలెన్స్ విభాగాలు రైస్ మిల్లులు, టోకు గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను బయటకు తీయడంలో చేతులెత్తేశాయి. ధరలు పెరుగుదలకు ఇవే కారణం.. కొరత కాదు._