దేశంలో బియ్యం కొరతే లేదు – మాఫియా దోపిడీ ! …..రేట్లు పెంచేస్తున్నారు దళారులు….చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు

_దేశవ్యాప్తంగా సామాన్యుడి కంచంలో అన్నం ముద్ద ఖరీదుగా మారుతోంది. గత కొన్ని వారాలుగా సాధారణ, సన్న బియ్యం ధరలు క్వింటాకు రూ. 600 నుంచి రూ. 1,000 వరకు ఎగబాకడం, బహిరంగ మార్కెట్లో కిలో ధరపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర భారం పడటం మధ్యతరగతి, పేద వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది._ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బియ్యం బ్యాగుల ధరలు మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరాయి. రాబోయే రోజుల్లో బియ్యం కొరత రానుందంటూ ప్రచారం...