రాహుల్ గాంధీ సంకల్పానికి కార్యరూపం ఇచ్చి బీసీ కుల గణనను సాకారం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్…. కాంగ్రెస్ నాయకులు
పోరు తెలంగాణ న్యూస్// హైదరాబాద్ శంషాబాద్ లో ఆదివారం నిర్వహించిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ నేత సీఎం కావడం ఖాయమని అన్నారు. బీసీ సీఎం అభ్యర్థికి రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికో.. ఏ ఒక్కరికో.. లేదా ఒక ప్రాంతానికో సొంతం కాదని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలనేదే రాహుల్ నినాదమని వివరించారు....