Oct 19, 2026,
కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. పండుగ వేళ డీజే శబ్దాలు, శబ్ద కాలుష్యంపై చర్చ మొదలైంది. పండుగలు ఆనందాన్ని పంచాలి కానీ విషాదానికి కారణం కాకూడదని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించి శబ్ద కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నారు.