లక్షెట్టిపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి 10 8 నైవేద్యాలు సమర్పణ.
పోరు తెలంగాణ, లక్షెట్టిపేట, అక్టోబర్ 13. లక్షెట్టిపేట పట్టణం బీట్ బజార్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని, అమ్మవారి మండపాన్ని పూలతో అలంకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని వివిధ రూపాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహం అందరి పై ఉండాలని, ప్రజలందరూ...