*తాడిపత్రి మున్సిపాలిటీ అన్ని స్థానాలకు పోటీ చేస్తాం*
*ఆంధ్రరాష్ట్ర ప్రజా సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు*
తాడిపత్రి:- జరగబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీకి ఛైర్మెన్ అభ్యర్థి మరియు నలభై ఎనిమిది వార్డులకు ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరపున పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు పత్రికాముఖంగా ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్దే ప్రధాన ద్యేయంగా,పీస్ అండ్ ప్రిడం తాడిపత్రి అనే స్లోగన్ నినాదం తో గెలుపే లక్ష్యంగా యాంటీ వైలెన్స్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ తాడిపత్రి గా తీర్చిడిద్దడమే మా పార్టీ ఎజెండా అని అని ఆయన తెలియజేశారు.తాడిపత్రి లో పీస్ఫుల్ అండ్ జాయిఫుల్ జీవితాన్ని కోరుకొనే తాడిపత్రి ప్రజలు మా పార్టీకి మరియు మాకు మద్దతుగా నిలిచి మమ్మల్ని గెలిపించాలని తాడిపత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.