తెలంగాణలో రూ.6,700 కోట్ల ధాన్యం మళ్లింపు కలకలం.. రైస్ మిల్లర్లపై ఈడీ ఉచ్చు.! • 2021–22 నుంచి భారీగా పక్కదారి పట్టిన ప్రభుత్వ ధాన్యం. • మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన మిల్లు, నివాసంలో సోదాలు.. రూ.30 లక్షల నగదు స్వాధీనం. • 3 వేలకుపైగా మిల్లుల రికార్డులపై నజర్.. అక్రమ ఆస్తుల జప్తు దిశగా దర్యాప్తు సంస్థ అడుగులు.
పోరు తెలంగాణ న్యూస్//హైదరాబాద్ తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం మళ్లింపు ఆరోపణలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. 2021–22 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6,700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం అక్రమంగా పక్కదారి పట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ భారీ వ్యవహారంపై లోతుగా దృష్టి సారించిన దర్యాప్తు సంస్థ, రాష్ట్రంలోని వివిధ రైస్ మిల్లుల ఆర్థిక లావాదేవీలపై విచారణను మరింత ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రాంగణాల్లో తనిఖీలు.. దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన...