పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను పరిచయం చేసేలా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. * డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ......