భగత్ సింగ్ స్పూర్తి తోనే యువజన ఉద్యమాలు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

రెబ్బెన మండలం సెప్టెంబర్ 28:

స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువజన ఉద్యమాలను నిర్మిస్తామని డివైఎఫ్ఐ రెబ్బెన మండల ప్రధాన కార్యదర్శి చాపిడి పురుషోత్తం అన్నారు సోమవారం రాంపూర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28న కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించారు చిన్ననాటి నుండే దేశభక్తి అతని నరాలలో నింపుకుంది పసివయసులోనే నేను తుపాకీ నాటితే మొక్కలుగా పెరిగి వేల తుపాకులు ఇస్తుందని ఆయుధాలను దేశ ప్రజలకు పంచి బ్రిటిష్ తెల్ల దొర పైన పోరాడుతానని ఆయన అన్నారు 14 ఏళ్ల వయసులోనే గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు స్వాతంత్రం వేచి చూస్తే రాదని పోరాడుతూనే వస్తుందని నవ జవాన్ సభలో చేరి యువకులను చైతన్యపరిచి భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులతో కలిసి పోరాటం చేశారు 1929 బ్రిటిష్ పార్లమెంట్ పైన పొగ బాంబు వేసి భారత ప్రజల ఆకాంక్షను కరపత్రాలు పంచుతూ వినిపించారు చివరకు ఈ దేశ స్వాతంత్రం కోసం1931 మార్చి 23న దేశం కోసం ఉరి కంభం ఎక్కారు ఆయన పుట్టి 119 ఏళ్లు అవుతున్న నిత్యం ప్రజలలో యువకులలో ఆయన స్ఫూర్తి రగులుతూనే ఉంది ఆయన ఈ దేశానికి రాజకీయ స్వాతంత్రం కాదు సమ సమాజం నిర్మాణం కోరుకున్నారు నేటి పాలకులు ఈ దేశంలో మతం కులం పేర్లతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ యువతను విభజించి పాలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యువతి యువకుల ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువత శక్తిని దేశానికి వినియోగించకుండా తీవ్ర నిరుద్యోగానికి కారణమవుతున్నారని ఆయన అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలపై దేశంలో విద్యా వైద్యరంగంలో జరుగుతున్న అవకతవకలపై భగత్ సింగ్ స్ఫూర్తితో జన్ జీ తరం పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు డోంగ్రే గజానంద్, ఉపాధ్యక్షులు చునర్కర్ అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.