రాజన్న సిరిసిల్ల:*
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈనెల 30న నిర్వహించి సిరిసిల్ల సభ ఉత్తర భారత దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే సభ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సిరిసిల్లలో సాయి మణికంఠ గార్డెన్స్ లో ముఖ్యమంత్రి సభ జన సమీకరణ పై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు తో పాటు సిరిసిల్ల జిల్లా లో వివిధ మండలాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
ఉత్తర భారతదేశ రాజకీయాల మార్చే సభ సిరిసిల్ల సభ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు.. *మంత్రి శ్రీధర్ బాబు..* *యువరాజు కోటను బద్దలు కొడుతాం..* *మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *సిరిసిల్లలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మంత్రులు..
Date:
Share post:

