సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గత 33 నెలలుగా ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు. రైతులు, కార్మికులు, విద్యార్థుల సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, దాదాపు 70 వేల ఉద్యోగాల భర్తీ వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలపై అదనపు పన్నులు, చార్జీల భారం వేయకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని మంత్రి చెప్పారు. వ్యవసాయం, కార్మికులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నాయని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వర్షాలు పడకపోయినా, రాష్ట్రంలో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినా ప్రతిపక్ష నేతలు సంతోషించే పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. అయితే ఈ అంశంలోనూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ప్రజలు, ప్రభుత్వం కోరుకుంటుంటే ప్రతిపక్షాలు ప్రతికూల ధోరణిలో వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర అంశాల్లో కోర్టు పరిణామాలపైనా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిలో బాధ్యతాయుత ప్రతిపక్షం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.

*సిరిసిల్ల వేదికగా ముఖ్యమంత్రి కీలక సందేశం ఇవ్వనున్నారు*

ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగేలా సిరిసిల్ల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక సందేశం ఇవ్వనున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను క్రమబద్ధీకరించుకుంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముందుకు సాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందని, భవిష్యత్‌పై బీఆర్‌ఎస్‌లో ఆందోళన కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ నెల 30న సిరిసిల్లకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

spot_img
spot_img

Related articles

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం...

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,...

ప్రభుత్వ పథకాలను అధికారులు సమర్ధవంతంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సెప్టెంబర్ 29, 2026: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలను అధికారులు సమన్వయంతో పనిచేసి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.