తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!
Nov 15, 2026,
తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!
తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మహిళలు, కార్మికుల సంక్షేమం కోసం 4,63,857 మంది అర్హులకు కొత్త సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేసింది. ఇందులో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని.. నవంబర్ 19వ తేదీన ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పింఛన్ నగదును జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఎంతో కాలంగా పింఛన్ల కోసం వేచి చూస్తున్న లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది

