Nov 16, 2026,
సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ ఎదగాలి: రాజ్నాథ్ సింగ్
15వ అంతర్జాతీయ ఎరో ఎన్డీటీ 2026 సింపోజియంలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం అధునాతన సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణలో ఎన్డీటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 2,000 మంది నిపుణులు హాజరయ్యారు.

