ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

Date:

Share post:

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం సెప్టెంబర్ 2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సైతం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు దేశ ప్రజలకు ఆదర్శం అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, ఆర్‌ఐలు సుధాకర్, రవి, లాల్ బాబు, కృష్ణారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్

భద్రాద్రి కొత్తగూడెం, (పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి-వల్లెపోగు రాము) భూర్గంపహాడ్ అక్టోబర్ 2 :- తెల్లవారుజామున బూర్గంపహాడ్ మండలం జింకల గూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

తెలంగాణలో ఆటో చార్జీల పెంపు

*🛺🛺తెలంగాణలో ఆటో చార్జీల పెంపు🛺🛺* 🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు 🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు 🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.