రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచిoచన ఎ రేవంత్ రెడ్డి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: ఈ నెల 19న సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు.

ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రెండు లక్షలు, ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు.

వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి రూ.5 లక్షలకు పెంచాలని సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా మినహాయించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సమావేశంలో స్పష్టం చేశారు. పంపిణీకి వీలుగా చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సూచించారు.

ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

spot_img
spot_img

Related articles

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్,...

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌...

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

మహేశ్వరం, నవంబర్ 16, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.