పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్// పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–C పోటీలు హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు నిర్వహించారు.
కాళేశ్వరం జోన్–I తరఫున పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్,బ్యాడ్మింటన్ విభాగాల్లో 1 రజతం, 6 కాంస్య పతకాలు సాధించి మొత్తం 7 పతకాలు కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ క్రీడాకారులను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ పోటీల్లో రామగుండం కమిషనరేట్ తరఫున మొత్తం 17 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్ విభాగంలో 5 కాంస్య పతకాలు సాధించారు.
50+ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఏసీపీ ప్రతాప్,డబ్ల్యూపీసీ ఎం.వనిత జోడీ కాంస్య పతకం సాధించింది.
40+ సింగిల్స్‌లో పీసీ ఎం.ఉదయ్ కిరణ్, PC-3499 కాంస్య పతకం సాధించారు.
ఓపెన్ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ కె. విజయ,కె.దీప జోడీ కాంస్య పతకం సాధించింది.
40+ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ ఎం. వనిత,కె.విజయ, PC-1469 కాంస్య పతకం సాధించారు.
40+ మిక్స్‌డ్ డబుల్స్‌లో పీసీ డి. రాజేందర్, PC-2952 మరియు డబ్ల్యూపీసీ ఎం. వనిత జోడీ కాంస్య పతకం సాధించింది.
బ్యాడ్మింటన్ విభాగంలో
ఓపెన్ సింగిల్స్‌లో కె. సురేష్ రజత పతకం సాధించారు.
ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కె. సురేష్,కె.విజయ జోడీ కాంస్య పతకం సాధించింది.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి కమిషనరేట్‌కు మంచిపేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.పోలీసు విధుల్లో నిరంతరం ఒత్తిడితో పనిచేసే అధికారులు, సిబ్బందికి క్రీడలు శారీరక,మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.
క్రీడల్లో ప్రతిభ చూపుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని శాఖ తరఫున ప్రోత్సహిస్తూ అవసరమైన సహకారం అందిస్తామని సీపీ తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు మల్లేశం, శేఖర్,రమేష్,సీసీ సందీప్, ఆర్‌ఎస్‌ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, సభ్యులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

లక్షెట్టిపేట లో ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పోరు తెలంగాణ లక్షెట్టిపేట అక్టోబర్ 2. లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి...

లక్షెట్టిపేట లో అవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ...

హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్...

రాహుల్ గాంధీ మహాత్మా గాంధీకి రాజ్ ఘాట్ వద్ద ఘన నివాళి

ఢిల్లీ-రాహుల్ గాంధీ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ఘాట్(రాజ్‌ఘాట్ ) గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆయన బాపు సమాధికి నివాళులర్పించారు. అలాగే...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.