ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ కు సహకారం అందిస్తాయి.

నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సంస్థ సీఎండీ శేఖర్ రెడ్డి గారు, సీఈఓ అనిల్ బాబు గారితో కలిసి రూ. 5.17 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.

వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థ ప్రతినిధి డి. సుమంత్ గారు, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రూ. 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.

ఒక మంచి కార్యక్రమానికి నిధులు అందించి సహకరించడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ గారితో పాటు ఇతర ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వచ్చే డిసెంబర్ 9 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్లను ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. నవంబర్ 30వ తేదీలోగా ఈ కిచెన్ల ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల కేలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని చెప్పారు.

బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్‌ను అందించే విధంగా చూడాలని, జీవితకాలం కొనసాగించాల్సిన ఈ కార్యక్రమం కాబట్టి సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.

spot_img
spot_img

Related articles

లక్షెట్టిపేట లో ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పోరు తెలంగాణ లక్షెట్టిపేట అక్టోబర్ 2. లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి...

లక్షెట్టిపేట లో అవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....

పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్

హైదరాబాద్// పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్...

రాహుల్ గాంధీ మహాత్మా గాంధీకి రాజ్ ఘాట్ వద్ద ఘన నివాళి

ఢిల్లీ-రాహుల్ గాంధీ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ఘాట్(రాజ్‌ఘాట్ ) గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆయన బాపు సమాధికి నివాళులర్పించారు. అలాగే...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.