మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణకు చర్యలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణ పనులపై మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు సంబంధిత అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు..

బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో చర్చించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ మంచిర్యాల లో దాదాపు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరణ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.