జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జగిత్యాల//
అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నరసింగపూర్ రోడ్‌కు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ పట్టనపొలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.చల్గల్ గ్రామానికి చెందిన మానాల మారుతి అనే వ్యక్తి “ASPECT TRADER” అనే యాప్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కంపెనీ గోల్డ్‌పై ట్రేడింగ్ చేస్తుందని, పెట్టుబడిపై ప్రతిరోజూ ఒక శాతం లాభం ఇస్తామని, 100 రోజుల్లో పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని, ఆ తర్వాత మరో 100 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. తమ కింద కొత్త ఇన్వెస్టర్లను చేర్పిస్తే వారికి, రిఫరల్ ఐడీ ఇచ్చిన వారికి కూడా లాభాలు వస్తాయని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో తెనాలికి చెందిన కన్నెగంటి జనార్ధన్, గుంటూరుకు చెందిన మోహన్, నాగ్‌పూర్‌కు చెందిన ఇర్ఫాన్ తదితరుల సహకారంతో యాప్‌ను రూపొందించి, పలువురి నుంచి దాదాపు రూ.5 కోట్ల మేర పెట్టుబడులు సేకరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు మానాల మారుతిని చల్గల్‌లోని అతని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి “ASPECT TRADER WELCOME ASPECTRA” పేరుతో ఉన్న పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ పీ. కరుణాకర్ తెలిపారు.

ఆన్‌లైన్‌లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానాస్పద పెట్టుబడి పథకాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.