డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి..సిఐ రాఘవేందర్ రెడ్డి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మహేశ్వరం, సెప్టెంబర్ 24, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని మహేశ్వరం సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మహేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ దినాన్ని పురస్కరించుకొని డ్రగ్స్ మహమ్మారి పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత కష్టపడి చదువు ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన సూచించారు. డ్రగ్స్ ఇతర చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండి మీ కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి ఆయన సూచించారు. విద్యార్థి దశ నుండి యువత అన్ని రంగాలలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. విద్యార్థులు ఇతర విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్, డాక్టర్ జహిదాబేగం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.