కొత్తగూడెం ఆర్సీ/పాల్వంచ,ఆగస్టు 21 :-
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్–142) ఆధ్వర్యంలో కేటీపీఎస్ ఏ కాలనీలోని సంఘం ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
2020 ఆగస్టు 21న శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం (ఎస్ ఎల్ బీ హెచ్ ఈ ఎస్)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటామని పేర్కొంటూ, అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస చారి, సత్యరాజ్, స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్, తోలెం కోటేశ్వరరావు, వేణు కుమార్, రాజు, లక్‌పతి తదితరులు పాల్గొన్నారు.


