దమ్మపేట రోడ్డులో సమస్యలు పరిష్కరించాలని వినతి కొత్తగూడెం ఆర్సీ/పాల్వంచ,ఆగస్టు 21

Date:

Share post:

📰 Generate e-Paper Clip

  • పాల్వంచ బి సి ఎం రోడ్డు నుంచి అయ్యప్పనగర్, శ్రీనివాస కాలనీ మీదుగా ములకలపల్లికి వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్‌ను దమ్మపేట మెయిన్ రోడ్డుకు మార్చాలని, అలాగే దమ్మపేట రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి, మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుడు కాల్వ ప్రకాశరావు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ లలితకుమారికి వినతిపత్రం అందజేశారు. దమ్మపేట రోడ్డులోని జమ్ముల సీతారామిరెడ్డి స్వగృహానికి వచ్చిన డిప్యూటీ మేయర్ లలితకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాల్వ ప్రకాశరావు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వినతిపత్రాన్ని సమర్పించారు. 33 కేవీ విద్యుత్ లైన్ నివాస ప్రాంతాల మీదుగా వెళ్లడం వల్ల ప్రజలకు ఇబ్బందులు, ప్రమాద భయం ఉందని, దీనిని ప్రధాన రహదారి వైపు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా దమ్మపేట రోడ్డుపై గుంతలను పూడ్చడంతో పాటు మురుగునీటి సమస్యను పరిష్కరించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వ ప్రకాశరావు, సత్యనారాయణ, జేసీబీ మధుసూదన్‌రెడ్డి, రాజేంద్రకుమార్, కె. సంజీవరావు, మంగీలాల్, నారాయణరెడ్డి, పెంకె శ్రీను, జెట్టి ఆనందరావు, కృష్ణారెడ్డి, ఎస్‌కే. బిక్షం, పుష్పరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
spot_img
spot_img

Related articles

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.