బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలి :- బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

*బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలి*

*విద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయాలి*

*పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలి*

*బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్*

 

మంచిర్యాల, ఆగస్టు 25:

బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీపీ మండల్ 108వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బీపీ మండల్ బీసీల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీపీ మండల్ కమిషన్ సిఫారసుల మేరకు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా బీసీ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని నరెడ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

“మా జనాభా ఎంత ఉంటే మా వాటా అంత ఇవ్వాలి” అనే సూత్రం ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయమైన వాటా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ప్రజా చైతన్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు.

*జీవో 97ను వెంటనే రద్దు చేయాలి*

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ జీవో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. స్కిల్ ఇండియా, ప్రైవేట్ యూనివర్సిటీలతో అనుసంధానం చేసే “శక్తి” పాలసీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే ప్రయత్నాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తాయని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకమైన సాంకేతిక విద్య అని, దానిని బలోపేతం చేసి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం, అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బీసీలకు విద్య, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా కల్పించే వరకు, అలాగే జీవో 97ను రద్దు చేసే వరకు బీసీ సమాజ్ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో  బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు వైద్య భాస్కర్. ప్రజావాణి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్ వర్మ. సీనియర్ నాయకులు దుర్గం రాజేష్ గౌడ్.బీసీ సమాజ్ నాయకులు ఎండీ లతీఫ్ జక్కం రవీందర్ ఎండి హుస్సేన్. గుండ్ల లక్ష్మణ్. వెన్నంపల్లి మురళి. పల్లపు శ్రీనివాస్. తోట సుధాకర్. బింగి చిన్న టిక్కయ్య. చింతం గోదాజీ తదితరులు పాల్గొన్నారు

spot_img
spot_img

Related articles

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.