నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలపై అవగాహన

సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్న పరికిపండ్ల నరహరి IAS ఆదేశాలు, మార్గదర్శకత్వంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో గురువులకు ఘన సన్మానం నిర్వహించారు.

గురువుల పట్ల శ్రీ పరికిపండ్ల నరహరి IAS కి ఉన్న అపారమైన గౌరవం, కృతజ్ఞతాభావం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచింది.

పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను ముఖ్య అతిథి జంగపల్లి రమాదేవి, చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శివకీర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్ మాట్లాడుతూ,
“నరహరి IAS ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన ఎదుగుదలకు కారణమైన గురువులను ఎప్పటికీ మరిచిపోరు. గురువులను స్మరించుకోవడం, గౌరవించడం ఆయనలోని గొప్ప సేవా సంస్కారానికి నిదర్శనం. సమాజానికి సేవ చేయాలనే ఆయన స్ఫూర్తితోనే ఆలయ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది” అని అన్నారు.

ఆలయ ఫౌండేషన్ సభ్యులు మీలంక సురేష్ మాట్లాడుతూ, ఒక విద్యార్థి విజయం వెనుక తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని అన్నారు.

ఆలయ ఫౌండేషన్ సభ్యులు శివచారి మాట్లాడుతూ, గురువులను సన్మానించుకోవడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత గొప్పదని అన్నారు.

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శివకీర్తి మాట్లాడుతూ, నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులను గౌరవించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ ధార నరసింహ.. మహేశ్వరం, సెప్టెంబర్ 5, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం...

బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి

సెప్టెంబర్ 06: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై...

చింతకుంటలో ఘనంగా తీజ్ నిమజ్జన మహోత్సవం

సెప్టెంబర్ 05: సిర్పూర్ (టి): సిర్పూర్‌ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి....

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పోరు తెలంగాణ ప్రతినిధి//చెన్నూర్// కోటపల్లి Dr. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కోటపల్లి మండలంలో గల ఉషోదయ స్కూల్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.