గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి గురువారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్వోత్తమరెడ్డి ఘన విజయం సాధిస్తారన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల నిబద్ధత, పట్టభద్రులు–ఉద్యోగ వర్గాలతో ఉన్న అనుబంధం సర్వోత్తమరెడ్డికి కలిసొస్తాయని మంత్రి పేర్కొన్నారు. పట్టభద్రుల ఆశయాలను శాసనమండలిలో బలంగా వినిపించే అవకాశం సర్వోత్తమరెడ్డికి కల్పించాలని మంత్రి ఆకాంక్షించారు.

ప్రస్తుతం ఏఐసీసీ, టీపీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న సర్వోత్తమరెడ్డి, పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.