ప్రజా పాలనలోనే సంక్షేమ కార్యక్రమాలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ప్రజా పాలనలోనే సంక్షేమ కార్యక్రమాలు..
మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణ నాయక్..

మహేశ్వరం, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్ తెలిపారు. శనివారం కొత్తగూడెంలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ప్రత్యేకత చొరవతో మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, బాలేష్, అంజాద్, దీక్షిత్ రెడ్డి, పూజిత, పరమేష్, కుమ్మరి కృష్ణయ్య, అంజయ్య, బురాన్, రాజశేఖర్ రెడ్డి, వినోద్ చారి, జమీల్, నాగేశ్వర్ రెడ్డి, శేఖర్, రవి, సురేష్ పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.