ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు 27.08.2026 రోజున ఉదయం 11గంటల నుండి తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమం అనుమతి కొరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ మరియు ఏసీపీ మంచిర్యాల ను కలసి వినతిపత్రంను టీజీజేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ కే. వనజ రెడ్డి సమర్పించారు. ఈ సందర్బంగా గడియారం శ్రీహరి ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది. టీజీజేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు, కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మరియు మంచిర్యాల అన్ని వర్గాల ఉద్యగుల అభిష్టం మేరకు ఐ డి ఓ సి నస్పూర్ లో మహా ధర్నా కార్యక్రమం శాంతియుతంగా అన్ని భాగస్వామ్య సంఘాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఉద్యోగుల గోంతుక పత్రిక ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీజీజేఏసీ lనాయకులు శ్రీనివాస్ దేశపాండే, అత్తె సుధాకర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు రావు, శ్రవణ్ కుమార్, గోపాల్ రాంకుమార్, తిరుపతి,నడిమెట్ల సత్యనారాయణ,ఎండీ యూసఫ్ రాజేందర్, వసంత్ తదితరులు పాల్గొన్నారు

